నాని సినిమాకు కీర్తి సురేష్ భారీ రెమ్యూన‌రేష‌న్..ఎంతో తెలుసా?

ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న టాలీవుడ్ న్యాచుర‌ల్ స్టార్ నాని నిన్న విజయదశమి పుర‌స్క‌రించుకుని త‌న 29వ చిత్రాన్ని కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీ‌కాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు `ద‌సరా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు.

Official: Nani 29 title is confirmed with the first look - English

ఈ మేర‌కు పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో నాని చెవికి పోగు- రింగుల జుట్టుతో రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తి సురేష్ న‌టించ‌బోతోంది. అయితే ఆమె ఈ సినిమాకు పుచ్చుకుంటున్న రెమ్యూన‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Keerthy Suresh on working with Rajinikanth in Annaatthe: I was completely starstruck! - Movies News

వినిపిస్తున్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. `ద‌స‌రా` సినిమాకుగానూ కీర్తి సురేష్ ఏకంగా రూ.3 కోట్లను పుచ్చుకుంటుంద‌ట‌. ఇది ఒక రకంగా భారీ రెమ్యూన‌రేష‌న్‌నే అయిన‌ప్ప‌టికీ.. ఇందులో ఎంత వ‌ర‌కు నిజ‌ముందో తెలియాల్సి ఉంది. కాగా, సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ ద‌స‌రా సినిమాలో.. సముద్రఖని, సాయికుమార్ కీల‌క‌మైన పాత్రల్లో కనిపించనున్నారు.