బాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ కన్నుమూత?

October 14, 2021 at 12:15 pm

బాలీవుడ్ స్టార్ హీరో  టైగర్ ష్రాఫ్ తో పాటుగా మరి కొంతమంది సినీ ప్రముఖులకు ఫిట్నెస్  టైగర్  గా పనిచేసిన కైజాద్ కపాడియా గురువారం తుది శ్వాస విడిచాడు. దీంతో ఒక్కసారిగా అతని కుటుంబ సభ్యులు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. అయితే టైగర్ కండలు తిరిగిన దేహంతో సూపర్ గా ఉన్నారు అంటే అందుకు గల కారణం కైజాద్ కపాడియా అని చెప్పవచ్చు.ఎంతోమంది జీవనశైలి మార్చిన కైజాద్ బాలీవుడ్ సెలబ్రిటీస్ ను సైతం తన వైపుకు తిప్పుకున్నాడు. ఈయన ఎంతో మంది బాలీవుడ్ నటులకు ఆయన ఫిట్నెస్ ట్రైనర్ గా పని చేశాడు. అయితే కైజాద్ కపాడియా మరణం పట్ల టైగర్స్ ఉదయమే సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేశాడు.

టైగర్ ష్రాఫ్త తల్లి ఆయేషా, సిద్ధాంత్ కపూర్, అలాగే నీల్ నితిన్ ముఖేష్, డేన్ని పాండే,రుస్లాన్ ముంతాజ్ తదితరులు కూడా అతని మృతికి సంతాపం వ్యక్తం చేశారు. చాలామంది ఫిట్నెస్ ట్రైనర్స్ కైజాద్ ను గురువుగా భావిస్తూ ఉంటారు. అంతే కాకుండా అతను ఎప్పుడూ కూడా సెలబ్రిటీస్ ట్రైలర్ అనే భావనను చూపించ లేదట. కైజాద్ మరణానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ఇది ఇలా ఉంటే పలువురు అభిమానులు అంతిమ సంస్కారం లో పాల్గొనడానికి పూణే కి బయల్దేరి వెళ్లాలని సమాచారం.

బాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ కన్నుమూత?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts