స్నేహితుడు మంచోడైన చెడ్డోడైన వదలద్దు..సిద్దార్థ్?

October 14, 2021 at 12:19 pm

అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్ధార్థ,శర్వానంద్ హీరోలుగా నటించిన తాజా చిత్రం మహాసముద్రం. ఈ సినిమాను రామబ్రహ్మం సుంకర నిర్మించారు ఈ సినిమాలో అదితీరావ్ హైదరి, అను ఇమ్మానియేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ మాట్లాడుతూ.. సినిమాలు విడుదల అయినప్పుడు నటులకు ప్రేక్షకులు మార్కులు వేస్తారు. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎన్ని మార్కులు వేస్తారా?అని ఆసక్తికరంగా చూస్తున్నాం. అలాగే ఇమేజ్ అన్న పదానికి చాలా అర్థాలు ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు అజయ్ భూపతి ఇందులో నాకు ఒక కొత్త ఇమేజ్ ని క్రియేట్ చేశాడు అని సిద్ధార్థ్ తెలిపారు.

ఇందులో అర్జున్ పాత్రలో శర్వానంద్, అలాగే విజయ్ పాత్రలో నేను నటించాను. ఈ సినిమా బరువు మోసిన శర్వానంద్ వరం కారణంగా ఇక్కడికి రాలేకపోయాడు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మహా సముద్రం ఒక అద్భుతమైన సినిమా, గర్వంగా చెప్పుకునే తెలుగు సినిమా అని అన్నారు. కొన్ని కొన్ని స్టోరీలకు హీరోలను వెతుక్కోవాల్సిన పనిలేదు, కథే హీరోలను వెతుకుంటుంది అంటారు. అదృష్టం కొద్దీ ఈ సినిమా శర్వానంద్, సిద్ధార్థ్ దగ్గర ఆగింది. స్నేహితుడు మంచోడైన, చెడ్డోడైన వదలద్దు అన్నదే ఈ కథలో మెయిన్ పాయింట్ అని తెలిపారు అజయ్ భూపతి.

స్నేహితుడు మంచోడైన చెడ్డోడైన వదలద్దు..సిద్దార్థ్?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts