‘ ఆమంచి ‘ కి చీరాల‌లో అంత సింప‌తి పెరిగిందా ?

రాజ‌కీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండ‌వు. ఎప్పుడూ ప్ర‌జ‌ల మూడ్ కూడా ఒకేవిధంగా ఉండ‌దు. ఇప్పుడు ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో ఇదే త‌ర‌హా వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ఇక్క‌డ రాజ‌కీయాలు మారుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో కొన్ని కార‌ణాల‌తో విజ‌యానికి దూర‌మైన‌.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు ఇప్పుడు ఫుల్లు పాజిటివ్ వేవ్ క‌నిపిస్తోంది. ఆయ‌న‌ను గెలిపించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. .ఒక మంచి నాయ‌కుడిని గెలిపించుకోలేక పోయామ‌నే ఆవేద‌న కూడా ఇక్క‌డి ప్ర‌జ‌ల మాట‌ల్లో స్ప‌ష్టంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో ఎప్పుడెప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయా? ఎప్పుడెప్పుడు ఆమంచిని గెలించుకుందామా.. అన్న చ‌ర్చ‌లు చీరాల ప్ర‌జ‌ల్లో.. ఇంకా చెప్పాలంటే మ‌ధ్య‌, దిగువ త‌ర‌గ‌తి వ‌ర్గాల్లో స్టార్ట్ అయ్యాయి.

చీరాల ప్ర‌జ‌ల మ‌ధ్య‌లో ఆమంచి ద‌శాబ్దంన్న‌ర కాలంగా మ‌మేక‌మై పోయారు. వేట‌పాలెం జ‌డ్పీటీసీగా విజ‌యం సాధించిన ఆయ‌న త‌ర్వాత‌.. సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ గ‌వ‌ర్న‌ర్‌.. రోశయ్య శిష్యునిగా.. అడుగులు వేశారు. ఇదే ఆయ‌న‌ను విజ‌యం వైపు.. ప్ర‌జ‌ల హృద‌యాల‌వైపు న‌డిపించింది. 2009లో కాంగ్రెస్ త‌ర‌ఫున తొలిసారి చీరాల బ‌రి నుంచి పోటీ చేసిన ఆమంచి.. తొలిసారి పోటీలోనే దిగ్విజ‌యం అందుకుని.. ప్ర‌జ‌ల ఆశీస్సులు పొందారు. దీంతో నిరంత‌రం.. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను త‌న‌వి గా భావించారు. ఆ టైంలోనే చీరాల‌ను కోట్లాది రూపాయ‌ల‌తో అభివృద్ధి చేశారు. ఆమంచిది దూకుడు మ‌న‌స్త‌త్వం అయినా ప‌నుల విష‌యంలో ప‌ని పూర్త‌య్యే వ‌ర‌కు త‌రుముతూనే ఉంటారు.

ఇదే.. త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఆమంచికి అభ‌యహ‌స్తంగా మారింది. నిజానికి 2014 ఎన్నిక‌లు ఒక సంక్లిష్ట వాతావ‌ర‌ణంలో జ‌రిగాయి. ఒక‌వైపు రాష్ట్ర విభ‌జ‌న‌, మ‌రోవైపు.. చంద్ర‌బాబు వ‌స్తున్నా మీకోసం.. పాద‌యాత్ర సింప‌తీ, మ‌రోవైపు.. వైసీపీ అధినేత జ‌గ‌న్ వేవ్‌.. ఇలా అనేక రూపాల‌లో ఆ ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ప‌డింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్లు అనేక మంది వేర్వేరు పార్టీల్లోకి చేరిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. ఆమంచి మాత్రం తొణ‌క‌లేదు.. సొంత‌గా చీరాల న‌వోద‌యం అనే పార్టీని ఏర్పాటు చేసుకుని.. ముందుకు సాగారు. దీనికి ప్ర‌జ‌లు జై కొట్టారు. అంత సంక్లిష్ట స‌మ‌యంలోనూ ఆమంచి విజ‌యం అందుకున్నారు. అయితే.. ప్ర‌జ‌ల అభివృద్ధి కోస‌మంటూ.. త‌ర్వాత కాలంలో ఆయ‌న‌.. టీడీపీలోకి చేరారు. కొంత వ‌ర‌కు అభివృద్ధి చేశారు.

అయితే.. విధానాలు న‌చ్చ‌ని కార‌ణంగా.. పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. వైసీపీలోకి చేరిపోయారు. ఈ క్ర‌మంలో వైసీపీ త‌ర‌ఫున గ‌త 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. అయితే.. ఆయ‌న ఎన్నిక‌ల్లో ప‌లు కార‌ణాల‌తో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు ఆయ‌న దూరం కాలేదు. ప్ర‌జ‌లు కూడా ఆయ‌న‌కు దూరం కాలేదు. మ‌త్స్యాకార‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌కు చేరువగానే ఉన్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే కృషి చేస్తున్నారు. తాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కోట్ల రూపాయ‌లు పెట్టి చేసిన అభివృద్ధిని ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల‌కు ఇప్పుడు మాట‌లు చెప్పేవారు .. కాదు.. త‌మ‌కు ప‌నులు చేసే వాడు కావాల‌ని నినదింస్తున్నారు.

ఈ ఫ‌లితంగానే చీరాల మునిసిపాలిటీకి సంబంధించి.. వైసీపీ నాయ‌కులు ఆమంచి వ‌ర్గానికి బీ ఫారాలుఇవ్వ‌క‌పోయినా.. త‌న వ‌ర్గాన్ని ఇండిపెండెంట్‌గా నిల‌బెట్టి.. మొత్తం 10 మందిని గెలిపించుకున్నారు. అంతేకాదు.. అధికార పార్టీ బీఫారాలు పొందిన వారికంటే.. కూడా ఆమంచి వ‌ర్గం.. ఎక్కువ ఓట్లు సాధించింది. అంతేకాదు.. పార్టీకి విధేయుడిగా ఉంటూనే.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ.. ప్ర‌భుత్వ‌ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేలా ఆమంచి కృషి చేస్తున్నారు.

ఇటీవ‌ల చీరాలలో ప‌లు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య త‌ర‌చూ ఏదో ఒక గొడ‌వ‌లు జ‌రుగుతూనే ఉంటున్నాయి. ఈ సంద‌ర్భంగా వారే తాము గ‌త ఎన్నిక‌ల‌లో మిమ్మ‌ల‌ను ఓడించి త‌ప్పు చేశామ‌ని ఆవేద‌న చెందుతున్న వీడియోలు ఎక్కువుగా వైర‌ల్ అవుతున్నాయి. ఏదేమైనా ఆమంచికి అన్ని వైపుల నుంచి.. పాజిటివ్ వేవ్ క‌నిపిస్తోంది. దూకుడు ఉంద‌న్న మాటే త‌ప్ప‌.. అభివృద్ధి విష‌యంలో చీరాల‌లో ఆయ‌న కొట్టేసేవాడే లేడ‌న్న‌ది అక్క‌డ జ‌నాల్లో ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది.