దసరా రోజు నాని బిగ్ సర్ప్రైజ్ !?

న్యాచురల్ స్టార్ నాని అభిమానులకు మరో అప్డేట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. నాని సినిమాల సెలక్షన్ లో పర్ఫెక్ట్ గా వెళ్తున్నాడు. ప్రస్తుతం నాని.. శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. నాని సినిమా వస్తుందంటే కుటుంబంతో సినిమా చూడొచ్చు అనే విధంగా ప్లాన్ చేసుకుంటాడు. ఇది వరకు వచ్చిన టక్ జగదీష్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయినా విషయం తెలిసిందే. అయితే ఈ సారి నాని
తరువాత సినిమా గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

అభిమానులకు నాని బిగ్ సుర్ప్రైస్ ప్లాన్ చేస్తున్నాడు. తన తర్వాతి సినిమా నుంచి బిగ్‌ అనౌన్స్‌ మెంట్‌ ఇచ్చాడు. తన తరువాత సినిమా అప్డేట్ ఈ దసరా పండుగ రోజున ఇస్తున్నట్టు, 15 వ తేదీన మధ్యాహ్నం 1.53 గంటలకు సిద్ధంగా ఉండండి అంటూ ట్విట్టర్‌ వేదికగా ప్రకటించాడు. కొత్త సినిమా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Share post:

Latest