బాలయ్య బాబు ధరించే విగ్గు ధర ఎంత తెలుసా..?

October 13, 2021 at 5:27 pm

ప్రముఖ నటుల లో ఒకరైన నటుడు రజనీకాంత్ సినిమాలలో తన హెయిర్ స్టైల్ ని డిజైన్ చేసే వ్యక్తి పేరు చందు. ఈయన సూపర్ స్టార్ లకే కాదు టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ సినీ తారలకు అద్భుతమైన హెయిర్ స్టైల్ చేయగల వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.

రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా లో రామ్ చరణ్ కి హెయిర్ స్టైల్ చేసింది తనే, ఇక అలాగే కాజల్ కూడా ఆ సినిమాలో తనదైన స్టైల్ లో రూపొందించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇక బాలయ్య బాబు విషయానికి వస్తే.. బాలకృష్ణ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వెరైటీ హెయిర్ స్టైల్ తో కనిపిస్తూ ఉంటాడు. అయితే హెయిర్ స్టైల్స్ చందు తెలిపిన ప్రకారం బాలకృష్ణ ఎక్కువ మీడియం హెయిర్ స్టైల్ ని బాగా ఇష్టపడతారు. స్టైల్ ను బాగా మెయింటెన్ చేయడానికి ఆసక్తి చూపుతారని తెలియజేశాడు.

వాస్తవానికి బాలకృష్ణకి హెయిర్ స్టైల్ చేయడం అంటే చాలా కష్టమని.. ఎందుకంటే ఆయన హెయిర్ స్టైల్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాడని అందుకు కొన్ని రూల్స్ ఉన్నాయని తెలియజేశాడు. ఇకపోతే బాలకృష్ణ వాడే ఎటువంటి విగ్గు ధర.. రూ.1.50 నుండీ 2 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలియజేశారు.

బాలయ్య బాబు ధరించే విగ్గు ధర ఎంత తెలుసా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts