ఆర్యన్ కేసు విషయంలో అసహనం వ్యక్తం చేసిన సంజయ్ గుప్తా?

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఆర్యన్ ను బయటకు తీసుకు రావడానికి షారుక్ ఖాన్ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించడం లేదు. అరెస్ట్ అయినప్పటి నుంచి ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నా మూడు సార్లు బెయిల్ కోసం పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆ పిటీషన్ ను పదేపదే తిరస్కరిస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సంజయ్ గుప్తా ట్విట్టర్ ద్వారా షారుక్ ఖాన్ కు మద్దతు తెలిపారు.

ఈ మేరకు సంజయ్ గుప్తా ట్వీట్ చేస్తూ.. ఆర్యన్ ఖాన్ అరెస్టు విషయంలో నిశ్శబ్దంగా ఉన్నటువంటి పలువురు బాలీవుడ్ పెద్దలను ప్రశ్నించారు. షారుక్ ఖాన్ సినీ పరిశ్రమలో ఎంతో మందికి ఉపాధి కల్పించడంతో పాటు గా, చాలా మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించారు. అంతే కాకుండా సినీ పరిశ్రమకు సంబంధించి ప్రతి విషయంలో కూడా షారుక్ ఖాన్ ముందుంటారు.

అలాంటిది ఆయన ఇలాంటి సంచులు పరిస్థితుల్లో ఉంటే ఏ ఒక్కరు కూడా ముందుకు రాకుండా నిశ్శబ్దంగా ఉండటం అంటే దానికి మించిన అవమానకరమైన విషయం మరొకటి లేదు అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నాడు సంజయ్ గుప్తా. ఈరోజు షారుక్ కుమారుడు ఉన్నాడు, రేపు మా వాళ్ళు ఉండవచ్చు లేదా మీ వాళ్ళు ఉండవచ్చు. అప్పుడు కూడా ఇలాగే మౌనంగా ఉంటారా అంటూ అసహనం వ్యక్తం చేశారు.