టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్‌..ఏమైందంటే?

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. ఓ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేసులో యువ‌రాజ్ సింగ్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆరెస్ట్ అయిన కొన్ని గంట‌ల్లోనే ఆయ‌న బెయిల్‌పై విడుదలయ్యాడు.

గతేడాది రోహిత్ శర్మతో లైవ్ చాట్‌లో, యుజ్వేంద్ర చాహల్‌ను లక్ష్యంగా చేసుకుని షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా యువరాజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే హిసార్‌కు చెందిన ఓ న్యాయవాది.. యువరాజ్ సింగ్‌పై కేసుపై హన్సి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అత‌డి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇప్పుడు ఈ కేసులోనే యువ‌రాజ్ అరెస్ట్ అవ్వ‌గా..అతనికి వెంటనే బెయిల్ మంజూరు అయింది. హైకోర్టు ఆదేశాల మేరకు వెంటనే యువరాజ్‌ను విడుదల చేశారు.

Share post:

Latest