సినిమాలో సక్సెస్ అయ్యి.. నిజ జీవితంలో ఫెయిల్యూర్ అయిన జంటలు ఇవే..!!

మనకు ఎవరితో..? ఎప్పుడు..? పెళ్లి జరగాలని రాసిపెట్టి ఉంటే, ఎంత కష్టం వచ్చినా సరే , వారితో తప్పకుండా జరుగుతుంది అనేది నానుడి. .కానీ ఆ పెళ్లిళ్ల విషయంలో మాత్రం జాగ్రత్త లేకపోతే..చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాకపోతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్నచిన్న అజాగ్రత్తల వల్ల పెళ్లి వరకు వెళ్లి , ఆ పెళ్లి కాస్తా పెటాకులు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. ముఖ్యంగా అందరి సమక్షంలో నిశ్చితార్థం జరుపుకొని, ఫలానా తేదీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని అనుకొని, ఆ తర్వాత చిన్న చిన్న కారణాల చేత క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ ను అందుకున్నప్పటికీ తమ నిజజీవిత వైవాహిక బంధంలో ఫెయిల్యూర్ గా నిలిచారు..అలా ఎవరెవరు పెళ్లిపీటలు ఎక్కకుండానే విడిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం..

రష్మిక – రక్షిత్ శెట్టి:

Rashmika Mandanna dating Vijay Deverakonda? Know more about India's latest  crush | Celebrities News – India TV
నిజానికి కన్నడ హీరోయిన్ అయినప్పటికీ ..తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే మంచి పాపులారిటీని అందుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టక ముందే, కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ పెళ్లి జరగలేదు.

అఖిల్ – శ్రీయ భూపాల్ :

Akhil Akkineni-Shriya Bhupal wedding called off: Is this the reason? -  Movies News
అక్కినేని నాగార్జున – అమలా దంపతుల కుమారుడు అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక శ్రీయ భూపాల్ తో అఖిల్ కి ఎంగేజ్మెంట్ కూడా 2016 లో జరిగింది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ వీరిద్దరి వివాహం ఆగిపోయింది.

మెహ్రీన్ – భవ్య భిష్ణోయ్ :

Mehreen Pirzada calls off engagement with Bhavya Bishnoi, says she has 'no  further association' with him - Hindustan Times
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మెహ్రీన్ కూడా, రాజకీయ నేత కొడుకు భవ్య భిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగింది. కానీ వీరిద్దరూ ఇటీవల విడిపోయారు.

సమంత – నాగ చైతన్య:

Amid Samantha Akkineni divorce rumours, Naga Chaitanya says it's 'painful'  to see his name being used to promote gossip - Hindustan Times
ఏ మాయ చేసావే సినిమాతో మొదలైన వీరి పరిచయం 10 సంవత్సరాల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని నాలుగు సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపిన తర్వాత అక్టోబర్ 2వ తారీఖున విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇక వీరు కూడా సినీ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ను అందుకున్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచారు.

నయనతార – ప్రభుదేవా :

Nayanthara-Prabhu Deva's incomplete love affair: When actress revealed why  they parted ways
ప్రభుదేవా-నయనతార కోసం ఏకంగా తన కట్టుకున్న భార్యను కూడా వదులుకున్నాడు.. అలా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వచ్చినప్పటికీ ప్రభుదేవా క్యారెక్టర్ నచ్చక నయనతార అతడిని దూరం చేసుకుంది.

ఇక వీరితో పాటు కమలహాసన్ – గౌతమి, ప్రియదర్శన్ – లిజి , అమలాపాల్ – ఏఎల్ విజయ్ లాంటి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు తమ నిజ జీవితంలో మాత్రం ఫెయిల్యూర్ గా నిలిచారు.