పెళ్లి కాకుండానే త‌ల్లైన బిగ్‌బాస్ భామ‌..నెట్టింట ఫొటో వైర‌ల్‌!

సిరి హన్మంత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబ్ వీడియోల‌తో పాటు పలు సీరియ‌ల్స్‌లోనూ న‌టించి ప్రేక్ష‌కుల‌కు చేర‌వైన సిరి.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో మొద‌టి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో స్ట్రోంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సిరి.. ఎలాగైనా టైటిల్ కొట్టాల‌ని ఫుల్ స్ట్రేట‌జీతో ముందుకు దూసుకుపోతోంది.

Siri Hanumanth (Sirisha) Age, Height, Family, Boyfriend, Biography & More

అయితే ఇలాంటి త‌రుణంలో సిరి సంబంధించిన ఓ షాకింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ మ‌ధ్యే నటుడు శ్రీహాన్‌తో సిరి నిశ్చితార్థం జ‌రిగిన విష‌యం తెలిసిందే. చానాళ్లుగా లవ్‌లో ఉన్న ఈ జంట‌ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే సిరి పెళ్లి కాకుండానే త‌ల్లైంద‌ట‌.

Bigg Boss Telugu 5: Siri Hanumanth Adopted the Child Actor - Sakshi

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కానీ, ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. సిరి-శ్రీ‌హాన్‌ జంట‌ ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు. చైల్డ్‌ ఆర్టిస్ట్‌ చైతూని అడాప్ట్‌ చేసుకుని.. అత‌డి ఆల‌నా పాల‌నా సిరినే చూసుకుంటోంది. ఆ విధంగా సిరి త‌ల్లైంద‌న్నామ‌ట‌. ఇక ఈ విష‌యం ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మార‌య‌డంతో.. సిరిపై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

Share post:

Latest