పునీత్ మ‌ర‌ణం.. బెంగళూరుకి వెళ్తున్న టాలీవుడ్ హీరోలు వీళ్లే!

లెజెండరీ నటుడు రాజ్‌కుమార్ మూడో కుమారుడు, క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల్లో, అభిమానుల్లో తీవ్ర విషాదాన్ని మిగుల్చుతూ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. ఫిజికల్‌గా ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌.. గుండెపోటుకు గురై మ‌ర‌ణించ‌డాన్ని ఎవ‌రూ న‌మ్మ‌లేక‌పోతున్నారు.

Kannada Star Puneeth Rajkumar Dies At 46, Sandalwood Actor Suffered Cardiac Arrest

మ‌రోవైపు దక్షిణ చలన చిత్ర నటీనటులు పునీత్ తో తమ బంధాన్ని అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తీవ్రంగా విలపిస్తున్నారు. ఇక పునీత్ రాజ్‌ కుమార్ అంత్యక్రియలు ఆయన కూతురు వందిత‌ యుఎస్‌ నుండి వచ్చాకే చేయనున్నారు. పునిత్ తండ్రి డాక్టర్ రాజ్‌కుమార్ సమాధి పక్కనే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Nandamuri Balakrishna Turns 60! From Chiranjeevi To Jr NTR, Celebs & Fans Pour In Best Wishes For The Actor

ప్ర‌స్తుతం పునీత్ రాజ్‌కుమార్ పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్ధం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఉంచారు. ఈ నేప‌థ్యంలోనే పునీత్‌కు నివాళి అర్పించ‌డం కోసం టాలీవుడ్ హీరోలు బెంగ‌ళూరుకి ప‌య‌ణ‌మ‌య్యారు. కాసేపటి క్రితంమే నంద‌మూరి బాలకృష్ణ బెంగళూరుకు బయలుదేరారు. ఇక మధ్యాహ్నం చిరంజీవి, సాయంత్ర జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లి మృత దేహానికి నివాళి అర్పించి.. పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. నరేష్‌, శివబాలాజీ కూడా పునీత్‌ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

 

Share post:

Latest