సోషల్ మీడియా వైరల్ అవుతున్న ఆర్యన్ ఖాన్ వీడియో.. అందులో ఏముందంటే?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విషయమే కనిపిస్తోంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టు కావడంతో దేశవ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ముంబై తీరంలోని ఓ క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం అందడంతో హఠాత్తుగా దాడి చేశారు ఎన్ సిబీ అధికారులు. ఈ దాడిలో ఆర్యన్ ఖాన్ తో పాటుగా మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఈ కేసు బాలీవుడ్ పరిశ్రమను కుదిపేసింది. ఇది ఇలా ఉంటే ఆర్యన్ ఖాన్ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేమిటంటే..

ముంబై లోని బస్తిన్ రెస్టారెంట్ లో పార్టీ చేసుకున్న ఆర్యన్ మలైకా అరోరా ఇతర స్నేహితులతో కలిసి బయటకు వచ్చారు. అప్పుడు బయటకు వస్తున్న ఆర్యన్ ఖాన్ దగ్గరకి ఒక చిన్నారిని ఎత్తుకొని ఒక బెగ్గర్ దగ్గరకు వెళ్లి చెయ్యి చాచి డబ్బులు అడగగా తన జేబులో ఉన్న మని ని తీసి ఇచ్చేశాడు.

https://www.instagram.com/p/BmIEdvjHhmZ/?utm_medium=copy_link

కాగా ఎన్ సిబి కస్టడీలో ఉన్న ఆర్యన్ ఖాన్ తాను నాలుగేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు విచారణలో ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో 2018 లో వచ్చిన ఈ బిచ్చగత్తె వీడియోని పోస్ట్ చేస్తూ ఆర్యన్ ఖాన్ ఎంత మంచి వ్యక్తి తో అంటూ షారుక్ ఖాన్ అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు.

Share post:

Latest