ఈడీ విచారణకు హాజరైన అనన్య పాండే?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయమే వినిపిస్తోంది. ఈ కేసులో భాగంగానే ఎన్సీబీ నటి అనన్య పాండే ఇంట్లో, అలాగే షారుక్ ఖాన్ ఇంట్లో సోదాలు నిర్వహించి,అనంతరం అనన్య పాండేను విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అవునా పాండే కూడా ఎన్సీబీ చెప్పిన విధంగా కార్యాలయానికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా ఆమె పేరు కూడా ఈ కేసు క్యాలెండర్ లో ఉందంటూ ఎంసిబి వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఆర్యన్ ఖాన్, అనన్య పాండే మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లో ఫుట్ బాల్ పేరుతో చాటింగ్ జరిగిందని, కానీ అది కోడ్ లాంగ్వేజ్ లో ఉందని తెలుస్తోంది.

ఇంతకుముందు ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాటింగ్ లలో నటితో డ్రగ్స్ పై చర్చలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. ఎం సి బి మాదకద్రవ్యాల వ్యాపారులతో ఆర్యన్ వాట్సాప్ చాటింగ్ ను ఇటీవల ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. అనన్య పాండే కేసు ఆర్యన్ ఖాన్ విషయంతో ముడిపడి ఉందో లేదో ఎన్సీబీ ఇంకా నిర్ధారించలేదు. ఇక తాజాగా షారుక్ ఖాన్ తన కుమారుడు ఆర్యన్ ఖాన్ ను ఆర్థర్ రోడ్డు జైలులో కలిసిన ఆర్యన్ ఖాన్ బాగోగుల గురించి ముచ్చటించారు.

Share post:

Latest