మ‌ళ్లీ ఆ డైరెక్ట‌ర్‌కే ఫిక్సైన‌ బ‌న్నీ..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌-మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో.. ఈ మూడు చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా 2020లో విడుద‌లైన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రం ఎన్నో రికార్డుల‌ను నెల‌కొల్పుతూ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించింది. ఈ మూవీకి త‌మ‌న్ ఇచ్చిన మ్యూజిన్ మ‌రింత హైలైట్ అని చెప్పాలి.

- Advertisement -

Allu Arjun credits Trivikram Srinivas as the main reason behind 'Ala Vaikunthapurramuloo' success | Telugu Movie News - Times of India

అయితే ఇప్పుడు ఈ సూప‌ర్ హిట్ కాంబోలో మ‌రోసారి రిపీట్ కాబోతోంది. అవును, బ‌న్నీ మ‌ళ్లీ త్రివిక్ర‌మ్‌కు ఫిక్సైన‌ట్టు నిర్మాత నాగవంశీ తాజాగా హింట్ ఇచ్చారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్, త‌మన్‌ల‌తో దిగిన ఫొటోను ట్విట్ట‌ర్ వేదిక‌గా షేర్ చేసిన నాగ‌వంశీ.. త్వ‌ర‌లోనే ఒక సర్ప్రైజ్ అనౌన్సమెంట్ రాబోతోంద‌ని తెలిపారు.

Thaman tracking the pulse of Allu Arjun fans

దాంతో బ‌న్నీ-త్రివిక్ర‌మ్‌ల కొత్త‌ ప్రాజెక్ట్‌నే అనౌన్స్ చేయ‌నున్నార‌ని అంద‌రూ భావిస్తున్నారు. మ‌రి ఇదే నిజ‌మైతే బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారు. కాగా, ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `పుష్ప‌`లో బ‌న్నీ న‌టిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్ డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది.

Share post:

Popular