రీతూ వర్మకు అది చాలా ఉంది..బ‌న్నీ బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య‌, అందాల భామ రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రేమ – పెళ్లి ప్రధానంగా సాగే ఈ చిత్రం అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుంది.

I Like Naga Shaurya's Innocence: Allu Arjun -

ఈ నేప‌థ్యంలోనే హైదరాబాద్‌లో నిన్న‌ రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన‌ అల్లు అర్జున్‌.. ఓపెన్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేశారు. స్టేజ్‌పై బ‌న్నీ మాట్లాడుతూ.. `నాగశౌర్య సినిమాలన్నీ చూశా. చాలా అందగాడు. తనలో ఒక ఇన్నోసెన్స్, స్వీట్‌నెస్‌ ఉంటుంది. అంత మంచి మనసున్న వ్యక్తి కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు.` అని చెప్పుకొచ్చాడు.

Varudu Kaavalenu pre-release event held; Trivikram wishes team very best

ఈ క్ర‌మంలోనే హీరోయిన్ రీతూ వ‌ర్మ గురించి మాట్లాడిన బ‌న్నీ.. `ఆమె మంచి న‌టి. అమ్మాయిల్లో నాకు హుందాతనం అంటే ఇష్టం.. అది రీతూ వర్మకు చాలా ఉంది` అంటూ పొగడ్త‌ల వ‌ర్షం కురిపించాడు. ఇక `ముంబయ్‌లో షూటింగ్‌ చేస్తున్నప్పుడు అన్ని విభాగాల్లోనూ సగం మంది మహిళలు ఉన్నారు.. తెలుగులో హీరోయిన్లుగా మాత్రమే వస్తున్నారు. అలా కాకుండా ఇండస్ట్రీలోని అన్ని విభాగాల్లోకి మహిళలు రావాలి.. లక్ష్మీ సౌజన్యకి ఆల్‌ ది బెస్ట్‌. వ‌రుడు కావ‌లెను మంచి విజ‌యం సాధిస్తుంది` అంటూ బ‌న్నీ పేర్కొన్నారు.

Share post:

Latest