`అఖండ‌`పై న్యూ అప్డేట్‌..ఎట్ట‌కేలకు అది కానిచ్చేసిన బాల‌య్య‌!

నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

- Advertisement -

Akhanda (2021) - IMDb

ఇక ఈ సినిమా మే నెల‌లో విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా షూటింగ్ ఫినిష్ అవ్వ‌క‌పోవ‌డంతో..విడుద‌ల వాయిదా ప‌డింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ సూప‌ర్ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌త రెండేళ్ల నుంచి జ‌రుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ను ఎట్ట‌కేల‌కు బాల‌య్య కానిచ్చేశాడు.

ఈ నేప‌థ్యంలోనే `సక్సెస్ ఫుల్ గా షూటింగ్‌ను పూర్తిచేశాము` అన్నట్టుగా బాలకృష్ణతో దర్శక నిర్మాతలు దిగిన ఒక స్టిల్ ను సోష‌ల్ మీడియా ద్వారా మేక‌ర్స్ పోస్ట్ చేశారు. మ‌రియు త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. కాగా, దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన రిలీజ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మ‌వుతుందో చూడాలి.

Share post:

Popular