అవమానంతో నిద్రపట్టని ఆ స్టార్ హీరో..!

October 13, 2021 at 3:19 pm

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రగడ చల్లారక ముందే.. సినీ ఇండస్ట్రీలో విభేదాలు తలెత్తు వస్తున్నాయి. ఇక అలాగే మా అసోసియేషన్ కూడా బద్దలై పోతే.. ఆత్మ లేదంటే ఏటీఎం లాంటివి పుట్టుకొస్తున్నాయి. వారికి కావాల్సింది కళాకారుల సంక్షేమం కాదని ఇప్పుడు స్పష్టంగా అర్థం అవుతోంది. కేవలం ఎన్నికలలో భాగంగానే రెండు ప్యానెల్ సభ్యులు అబద్ధాలు తెలియజేశారు.

ఇక మన వ్యాపారమే బాగుండాలి, మనమే బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి రాజకీయాలకు పాల్పడ్డారు. నిజంగా కళాకారుల కోసం ఆలోచించే వారు అయితే ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరు కలిసి పోయి మా అభివృద్ధికి పాటుపడేవారు. కానీ ఇక్కడ గెలవలేదని అహంకారం, ఓడిపోయి పట్టు సరిపోయిందని అవమానం, కేవలం ఒక వర్గం మాత్రమే గెలిచింది అనే ఆలోచన వారిని నిద్ర లేకుండా చేస్తోంది.

తనకున్న వేల కోట్ల రూపాయలను కాపాడుకోవాలి. ఇప్పుడేం చేయాలి ఎలా పట్టు నిలబెట్టుకోవాలి అన్న ఆలోచన కూడా ఆయన్ని కలిచివేస్తోంది. అందుకోసమే తెరపైకి ఆత్మ, ప్రేతాత్మ, ఏటీఎం వంటి పేర్లను తీసుకొచ్చారు. కేవలం ఈ పేర్లన్నీ ప్రత్యర్థులను భయపెట్టి తమ చేతుల్లో ఉంచుకోవడం కోసమే చేస్తున్నారు. అయితే ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.

అవమానంతో నిద్రపట్టని ఆ స్టార్ హీరో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts