వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ పంచ్ వచ్చేసింది ..!

October 6, 2021 at 6:03 pm

మెగా హీరో వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమా తో మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న గణేష్ సినిమాలో నటిస్తున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాను సిద్దు ముద్ద అలాగే అల్లు అరవింద్ కుమారుడు అల్లు బాబు ఇద్దరూ కలిసి ఇ నిర్మిస్తున్నారు . తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్నారు .

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లకు మంచి ఆదరణ వచ్చింది. అలాగే ఈ సినిమాలో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలు ఉపేంద్ర సునీల్ శెట్టి నటిస్తుండటంతో సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి . ఇక తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమప్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో బాక్సర్ గెటప్ తో వరుణ్ తేజ్ అందరినీ అలరించాడు. రక్తంతో ఉన్న ఓ సీన్ ను ఈ గ్లిమ్స్ లో చూపించారు. డిసెంబర్ 3వ తేదీన థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇక తాజాగా విడుదలైన అప్డేట్ తో అందరికి అంచనాలు పెరిగిపోయాయి.

వరుణ్ తేజ్ ‘గని’ ఫస్ట్ పంచ్ వచ్చేసింది ..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts