ఈ ట్వీట్టే సమంత కొంప ముంచేసింది !

October 6, 2021 at 6:46 pm

టాలీవుడ్ లోనే హిట్ పెయిర్ గా సమంత అండ్ నాగ చైతన్య పేరు గాంచిన విషయం మనకు తెలిసిందే. ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నారు ఈ జంట. కానీ కొన్ని అనుకోని కారణాల వలన ఇద్దరు కూడా విడాకులు తీసుకుని స్నేహితులుగా ఉంటామని విడిపోయారు. అసలు వీరిద్దరూ విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై అందరిలోనూ చర్చ మొదలయింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి బ్రేకప్ కు కారణం ఒక వ్యక్తి అని సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. సమంతా హెయిర్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ చేసిన ట్వీట్ కారణంగానే వారిద్దరి విడిపోయారు అనే వార్తలు షికారు చేస్తున్నాయి.

 

ఈ మధ్య సామ్ పుట్టినరోజన ప్రీతమ్ జుకాల్కర్ తన ఇన్ స్టా లో సమంతతో క్లోజ్ గా ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ‘ఈ పిక్ ఇప్పుడు నాకుచాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే.. ఈ సెల్ఫీని మన మినీ హాలీడే గోవాకి వెళ్ళడానికి ముందు తీసింది అని, అలాగే సమంతని పెర్సనల్ గా కలుసుకొని ఆమెను దగ్గరకు తీసుకోకపోతే నాకు రేపనేదే లేదు, అప్పటి వరకూ ఆగలేకపోతున్నాను హ్యాపీ బర్త్ డే జి’ అంటూ ప్రీతమ్ జుక్కలర్ పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు సామ్ చైతూ డివోర్స్ కి కారణం అయిందన్న వార్త వైరల్ గా మారింది.

ఈ ట్వీట్టే సమంత కొంప ముంచేసింది !
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts