నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రం `తలైవి`. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషించగా..తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించాడు. ఈ నెల 10న చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కంగనాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ..ఈ ప్రాజెక్ట్‌కు కథ రాసే అవకాశం ఇచ్చిన నిర్మాత విష్ణువర్థన్‌కు ధన్యవాధాలు. అయితే ఆ కథ చెప్పినప్పుడు టైటిల్ పాత్ర కోసం మరో నటిని అనుకున్నారు దర్శకనిర్మాతలు.
అప్పుడు కంగనా అయితే ఈ పాత్రకి న్యాయం చేయగలదని నా అభిప్రాయం వ్యక్తం చేశా. కానీ ఆ విషయాన్ని అడిగేందుకు ఆమెను అప్రోచ్ అయ్యే వారు ఎవరు? ఒకవేళ ఆమెకు కథ నచ్చక పోతే మనల్ని బతకనివ్వదు. ఇక ఫైనల్‌గా ఆమెకు కథ నచ్చింది. జయలలితగా కంగనా అదరగొట్టేసింది. ఈ సినిమా విడుదలయ్యాక నటిగా ఆమె మరోస్థాయికి చేరుకుంటుంది` అంటూ చెప్పుకొచ్చారు.