రైతుల కోసం సేతుప‌తి పోరాటం..ఆక‌ట్టుకుంటున్న `లాభం` ట్రైల‌ర్!

September 3, 2021 at 7:35 pm

కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి, శ్రుతి హాస‌న్ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `లాభం`. ఎస్పీ జననాథన్‌ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది.

Vijay Sethupathi in Laabam trailer review - News - IndiaGlitz.com

అయితే వినాయ‌క చ‌వితి కానుక‌గా ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో సెప్టెంబరు 9న విడుదల చేయ‌బోతున్నారు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా లాభం ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కంపెనీ ఉత్పత్తులను సరఫరా చేయడానికి కార్పొరేట్ నాయకుడు(జ‌గ‌ప‌తిబాబు) ప్రణాళికలు రూపొందించడంతో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంది.

Vijay Sethupathi's 'Laabam' Trailer 2 Out : A Perfect Big-Screen Entertainer

బ‌ల‌మైన సందేశంతో ఈ సినిమా రాబోతోంద‌ని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపించనున్నారు. ట్రైల‌ర్‌లో ఆయ‌న లుక్‌, డైలాగ్స్ సైతం బాగుతున్నాయి. మొత్తానికి ట్రైల‌ర్‌తో అంచ‌నాలు పెంచేసిన సేతుప‌తి సినిమాతో సెప్టెంబ‌ర్ 9న ఏ మేర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి. కాగా, ఈ సినిమా డైరెక్టర్ ఎస్పీ జననాథన్ పోయిన‌ మార్చిలో గుండెపోటుతో మరణించారు.

రైతుల కోసం సేతుప‌తి పోరాటం..ఆక‌ట్టుకుంటున్న `లాభం` ట్రైల‌ర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts