లైగర్ క్రేజీ అప్ డేట్.. మామూలుగా లేదుగా?

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో లైగర్ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు. పూరి జగన్నాథ్ అలాగే ధర్మ పొడక్షన్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు హిందీ తో పాటు మిగతా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతోంది. ఈ సినిమాను పూరి జగన్నాథ్ 125 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేశారు చిత్ర బృందం. బుధవారం కొత్త షెడ్యూల్ ప్రారంభం అయిందని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఫోటో ని విడుదల చేశారు. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ షర్టు లేకుండా బాక్సింగ్ రింగ్ లో కూర్చున్నాడు. ఈ ఫోటోని బట్టి చూస్తే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించబోతున్నాడు అని అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటోకి రక్తం.. చెమట..హింస అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

Share post:

Latest