మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత?

September 15, 2021 at 6:11 pm

గత కొద్ది రోజులుగా సమంత, నాగచైతన్య విడాకుల విషయంలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం సమంతా నెక్స్ట్ మూవీ గురించి హాట్ టాపిక్ గా మారింది. సమంత ఇటీవలే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. అలాగే మరొక వైపు తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేస్తోంది. అందులో నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే సమంత రెండు బాలీవుడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలె ఓ బేబీ, మజిలీ, యూటర్న్ ఇలాంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకున్న సమంత ఇప్పుడు మరొక కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాలకు గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలిపిన సమంత తాజాగా ఎస్ఆర్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రాజెక్ట్ కోసం సంతకం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం గురించి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts