ప‌వ‌న్ బ‌ర్త్‌డేకి అక్క‌డ సంద‌డి చేయ‌బోతున్న సినీ తార‌లు..!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్‌డే(సెప్టెంబ‌ర్ 2) రేపు. ఆయ‌న పుట్టిన రోజు వస్తుందంటే చాలు ఫ్యాన్స్‌లో ఎక్కడ లేని సంబురం వస్తుంది. తమ అభిమాన హీరో బ‌ర్త్‌డే గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఫ్యాన్స్‌ తహతహలాడుతుంటారు. ఇక ప‌వ‌న్ న‌టిస్తున్న చిత్రాల‌న్నిటి నుంచీ ఏదో ఒక అప్డేట్ వ‌స్తుంటుంది.

Happy Birthday Pawan Kalyan

ఈ సారి కూడా ప‌వ‌న్ అభిమానుల కోసం ఆయ‌న న‌టిస్తున్న చిత్రాల నుంచి సర్‌ప్రైజ్ లు సిద్ధం అయ్యాయి. అలాగే మ‌రోవైపు ప‌వ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ మ‌ధ్య బాబు పాపులర్ అయ్యిన ట్విట్టర్ స్పేస్ సైతం నిర్వహించ‌బోతున్నారు. ఈ స్పేస్ రేపుసాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ కానుంది.

Pawan Kalyan Trends™ (@TrendPowerstar) | Twitter

ఈ ట్విట్ట‌ర్ స్పేస్‌లో ద‌ర్శ‌కులు క్రిష్, బాబి, పవన్ వీరాభిమాని బండ్ల గణేష్, వకీల్ సాబ్ నటి అనన్య నాగళ్ళ, నటుడు బ్రహ్మాజీ, స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్, నీలిమ, సంజనా గల్రాని, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్, వరుణ్ సందేశ్, సాహిత్య రచయిత భాస్కర భట్ల మ‌రియు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం పాల్గొని సంద‌డి చేయ‌బోతున్నారు.

Share post:

Latest