అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన థమన్.. ఏంటంటే?

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు అంటూ ఒక శుభవార్త ను పంచుకున్నారు. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ ను త్వరలోనే కలవబోతున్నారని అని వెల్లడించారు. మీ ప్రార్థనలు అన్నీ కూడా పని చేస్తున్నాయి.నా సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని, ఈ అప్డేట్ ఇచ్చినందుకు సతీష్ బొట్టాకు ధన్యవాదాలు. రెండు రోజుల్లో నా ప్రియమైన సాయి ని కలవడానికి వెళ్ళిపోతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ థమన్ ట్వీట్ చేశారు . సాయి ధర్మ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమాకు దేవాకట్టా దర్శకత్వం వహించారు.

ఈ సినిమాను జేబీ ఎంటర్టైన్మెంట్స్, జి స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా జగపతిబాబు, రమ్యకృష్ణ ఇందులో కీలక పాత్రలు పోషించారు. రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయం గురించి మనందరికీ తెలిసిందే. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి అక్కడ చికిత్సను అందించారు. అయితే సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని చిరంజీవి తెలియజేసిన విషయం కూడా తెలిసిందే.

Share post:

Latest