ఆ సినిమాపైనే ఆశ‌ల‌న్నీ పెట్టుకున్న శ్రీ‌ముఖి..స‌క్సెస్ అవుతుందా?

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ‌.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది.

Sreemukhi Photos Archives - Gulte

ప్ర‌స్తుతం బుల్లితెర రాముల‌మ్మ‌గా దూసుకుపోతున్న శ్రీ‌ముఖి.. వెండితెర‌పై సైతం స‌త్తా చాటేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో న‌టించ‌గా.. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దాంతో శ్రీ‌ముఖి ఆశ‌ల‌న్నీ `మాస్ట్రో` సినిమాపై పెట్టుకుంది.

Maestro locks a new release date

నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో న‌భా న‌టేష్, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ నెల 17న విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీలో కీలకమైన పాత్రలో నటించింది శ్రీముఖి. ట్రైలర్‌లో కూడా ఈమె పాత్రకు బాగానే ఇంపార్టెన్స్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. తన కెరీర్‌కు మాస్ట్రో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని గట్టిగా నమ్ముతుంది శ్రీముఖి. మ‌రి మాస్ట్రో స‌క్సెస్ అయ్యి శ్రీ‌ముఖి మంచి కమ్‌బ్యాక్ ఇస్తుందో లేదో చూడాలి.