సోనూసూద్ ఎన్ని కోట్ల ఆస్తుల‌కు అధిప‌తో తెలిస్తే మ‌తిపోతుంది?!

సినీ న‌టుడు, స‌మాజ సేవ‌కుడు సోనూసూద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ.. ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాడు. ఇప్ప‌టికీ నిర్వ‌హిస్తున్నాడు కూడా. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్ర‌జాసేవ‌ను మాత్రం ఈ రియ‌ల్ హీరో మ‌ర‌వడం లేదు.

I-T Department 'surveys' 6 locations of actor Sonu Sood | India News –  India TV

ఇదిలా ఉంటే.. సోనూసూద్ ఆస్తుల‌పై ఐటీ శాఖ దాడులు చేయ‌డం తీవ్ర‌ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంటితో పాటు ముంబైలోని ఆయనకు చెందిన ఆఫీసులో కూడా తనిఖీలు చేశారు. ఈ నేప‌థ్యంలోనే సోనూసూద్ ఆస్తుల విలువెంత..? అన్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే కేవ‌లం రూ.5500 తో ముంబైలో అడుగు పెట్టిన సోనూ.. ఇప్పుడు రూ.130 కోట్ల ఆస్తుల‌కు అధిప‌తి అయ్యాడు.

Inside Sonu Sood's Gorgeous House in Mumbai: Om Wall, Buddha Statues And a  Lot of Peace

ప్ర‌స్తుతం ముంబైలోనే భార్య‌, పిల్ల‌ల‌తో స్థిర‌ప‌డిన సోనూ.. సినీ ఇండ‌స్ట్రీలో బాగానే సంపాదించాడు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, పంజాబీ చిత్రాలలో ప్రసిద్ధి చెందిన సోనూ.. ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల‌కు వ‌ర‌కు పుచ్చుకునేవాడు. అలాగే ప‌లు బ్రాండ్స్‌కు ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ కొంత సొమ్మును సంపాదిస్తున్నాడు. మ‌రోవైపు సోనూకు శక్తి సాగర్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. మొత్తం మీద సంవ‌త్స‌రానికి సోనూ రూ.12 కోట్ల వ‌ర‌కు సంపాధిస్తున్నారు.

Share post:

Popular