బిగ్‌బాస్‌-5: రూ.50 లక్షలు ఇస్తే వాళ్ల ముఖాన కొడ‌తానంటున్న‌ సింగర్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. రెండో వారంలో కెప్టెన్ అయ్యేందుకు ఇంటి స‌భ్యులు ఘోరా ఘోరీగా పోటీ ప‌డుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల్లో తిట్టుకోవడం, చివరికి కొట్టుకునే స్థాయికి వెళ్తుండ‌డంతో ప్రేక్ష‌కులు నోరెళ్లబెడుతున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లోని రెండో లెవల్ సాగరా సోదరా అనే టాస్క్ జ‌రిగింది.

Bigg Boss Telugu 5 gets a new time slot; details inside - Times of India

ఈ ఆటకి ఎల్లో టీం తరుపున మానస్ సంచాలకుడిగా ఉండగా.. బ్లూ టీం తరుపున సింగ‌ర్ శ్రీరామ్ సంచాలకుడిగా ఉన్నాడు. ఈ టాస్క్‌లో ఎల్లో టీం 33.3 మీటర్స్‌.. బ్లూ టీం 33 మీటర్స్ పొడువు ఉండగలిగాయి. కానీ, ఎల్లో టీం లో ఉన్న శ్వేత చివరి క్షణంలో కిందకి పడటంతో..బిగ్‌బాస్ టాస్క్‌ను ర‌ద్దు చేశారు. దాంతో బ్లూ టీ సంచాల‌కు శ్రీ‌రామ్ ఫుల్ హ్యాపీ అవుతూ డ్యాన్స్‌ చేశాడు. అతడి ప్రవర్తనకు చిర్రెత్తిన రవి టాస్క్‌ రద్దయినందుకు సిగ్గుతో తల దించుకోవాలని చురకలంటించాడు.

bigg boss 5 second week: Bigg Boss 5 Telugu - Singer Sriram: బిగ్‌బాస్  ఇచ్చే ప్రైజ్ మనీ అక్క‌ర్లేదన్న శ్రీరామ్‌.. నాతో మైండ్ గేమ్‌లొద్దంటూ యాంక‌ర్  ర‌వికి వార్నింగ్‌ ...

దాంతో వీరిద్ద‌ర మ‌ధ్య వివాదం రాజుకుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ర‌వి గొడ‌వ‌కు పులిస్టాప్ పెడ‌దామ‌ని శ్రీ‌రామ్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌గా..కోపోద్రిక్తుడైన శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. `నేను తెలుగువాళ్ల‌కు చేర‌వ‌య్యేందుకు బిగ్‌బాస్‌కు వ‌చ్చాను. గెలవడానికేమి రాలేదు.. రూ.50 లక్షలు ఇచ్చినా వాళ్ల ముఖాన కొడ‌తా` అంటూ శ్రీ‌రామ్ ర‌వి ముందు ఊగిపోయాడు.

బిగ్ బాస్ సీజన్ 5: నాలుగవ కంటెస్టెంట్ గా ఇండియన్ ఐడల్ విన్నర్, సింగర్,  యాక్టర్ శ్రీరామ చంద్ర | bigg boss season 5 singer sriram chandra enters bigg  boss house as fourth contestant

Share post:

Latest