రానా దగ్గుబాటి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భీమ్లా నాయక్` ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
అయితే ఈ చిత్రంలో రానాకు భార్యగా తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని ఈ మధ్య బాగా ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు రానాకు డైరెక్టర్ కొత్త భార్యను తీసుకొచ్చాడు. వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం.. మలయాళం నటి సంయుక్తా మీనన్‌ను రానా భార్య పాత్ర కోసం ఎంపిక చేశారట.
ఇటీవల డైరెక్టర్ ఆమెను సంప్రదించగా.. సంయుక్తా వెంటనే ఓకే చెప్పినట్టు టాక్ నడుస్తోంది. అంతేకాదు, త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని ప్రచారం నడుస్తోంది. కాగా, ఈ నెల 20న రానాకు సంబంధించిన టీజర్ విడుదల కానున్న సంగతి తెలిసిందే.