హాలీవుడ్ టెక్నాలజీతో ప్రభాస్ సినిమా.. ఈసారి మాములుగా ఉండదు?

టాలీవుడ్ యంగ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. బాహుబలి సినిమా తో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రశాంత్ నీల్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ టెక్నాలజీ తో రూపొందిస్తున్నారట. ఈ సినిమా షూటింగ్ ముంబై లో శరవేగంగా జరుగుతోంది.

ఈ సినిమా కోసం ఇండియాలో ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా హై అందు హాలీవుడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అని సమాచారం. హాలీవుడ్ లో రూపొందిన మ్యాట్రిక్స్ బ్యాట్ మ్యాన్ లాంటి సినిమాలలో ఉపయోగించిన టెక్నాలజీతో ఈ సలార్ సినిమాను రూపొందిస్తున్నారట. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే భారతీయ సినీ ప్రియులకు సరికొత్త సినిమాటిక్ అనుభవాన్ని కలిగిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది.