సాయి ధరమ్ తేజ్ కోసం బరిలో దిగిన మెగా బ్రదర్స్..!

సాయి ధరంతేజ్ ఇటీవల రోడ్ యాక్సిడెంట్లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఇకపోతే ఆయన నటించిన రెండు సినిమాలలో రిపబ్లిక్ సినిమాను అక్టోబర్ ఒకటో తేదీన రిలీజ్ చేయాలని సాయి ధరంతేజ్ చిత్ర బృందాన్ని కోరినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో తప్పకుండా సాయిధరంతేజ్ పాల్గొనాల్సి ఉంది..కాకపోతే ఆయన ప్రచారంలో పాల్గొన లేనిపక్షంలో వారి మేనమామగారు అయిన మెగా బ్రదర్స్ బరిలోకి దిగుతున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈరోజు రిపబ్లిక్ సినిమాకి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు సమాచారం.. ఇక ప్రమోట్ చేయడానికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరవుతున్నారు..ఇక రిపబ్లిక్ సినిమా కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్ మినహా..మిగతా మూవీ యూనిట్ మొత్తం హాజరవుతోంది.. అంతా సవ్యంగా జరిగితే సినిమా నుండి సాయి ధరమ్ తేజ్ కు సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఇతర మెగా హీరోలు కూడా రిపబ్లిక్ సినిమా ప్రచారం కోసం వారి సోషల్ మీడియా పేజీలను తీసుకుంటున్నట్లు సమాచారం.. రాజకీయ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవా కట్టా దర్శకత్వం వహిస్తున్నారు.జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాతలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు మరియు రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Share post:

Latest