ఆ విషయంలో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయిన సాయి పల్లవి?

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం కోసం చాలా మంది హీరో,హీరోయిన్లు వేచి చూస్తూ ఉంటారు. అలాంటిది హీరోయిన్ సాయి పల్లవి మాత్రం చిరంజీవి సినిమాలో నటించేందుకు నో చెప్పిందట. తమిళ హిట్ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సోదరిగా కీలక పాత్ర కోసం ముందుగా సాయిపల్లవినే పడినప్పటికీ అందుకు ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో కీర్తి సురేష్‌ను ఆ పాత్ర కోసం ఎంచుకున్నారు.

- Advertisement -

అయితే ఇన్ని రోజులు ఈ వార్త పై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం మాత్రమే.కానీ తాజాగా లవ్ స్టోరి ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరు స్వయంగా ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. తాను కుదిరితే సాయిపల్లవికి జోడీగా డ్యాన్స్ వేయాలని కోరుకుంటానని తనకు చెల్లెలిగా ఆమె నటించకపోవడం మంచిదే అని చిరు చెప్పుకొచ్చారు. చిరు ఇలా అంటుంటే సాయిపల్లవికి చాలా ఇబ్బందిగా అనిపించింది.నేను మీ సినిమాను కాదనడమా అంత మాట అనకండి అంటూ సాయిపల్లవి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. తనకు రీమేక్ సినిమాలంటే భయం అని అందుకే ఈ సినిమా ఒప్పుకోలేదని సాయిపల్లవి వివరణ ఇచ్చింది. కానీ రీమేక్ సాయిపల్లవి ఈ విషయంలో చాలా దృఢంగానే నిలబడుతోంది.

Share post:

Popular