మళ్లీ మొదటికొచ్చిన ఆర్ఆర్ఆర్.. జక్కన్నకు నచ్చలేదట!

September 20, 2021 at 1:23 pm

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా అనుకున్న దానికంటే మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం దర్శకుడు రాజమౌళి అని తెలుస్తోంది.

ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. అయితే కొమురం భీం, బ్రిటిష్ అమ్మాయి జెన్నిఫర్(ఒలివియా మారిస్)ల మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ బాగా వచ్చాయట. వాటిని మరింత రొమాంటిక్‌గా తెరకెక్కించాలని భావించిన జక్కన్న ఈ సీన్స్‌ను మళ్లీ రీషూట్ చేయబోతున్నాడట. దీంతో ఈ సినిమా మరింత ఆలస్యంగా రానుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ కూడా మరింత ఆలస్యం కానుండటంతో ప్రేక్షకులు నిరాశకు లోనవుతున్నారు.

దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు గతంలో ప్రకటించినా, ఇప్పుడు అది కుదరదని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జక్కన్న ప్రెస్టీజియస్‌గా తీర్చిదిద్దుతుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

మళ్లీ మొదటికొచ్చిన ఆర్ఆర్ఆర్.. జక్కన్నకు నచ్చలేదట!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts