64 రోజుల్లో పూర్తైన `రిప‌బ్లిక్` షూట్‌..అదిరిన మేకింగ్ వీడియో!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్‌, డైరెక్ట‌ర్ దేవ్‌ క‌ట్టా కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రిప‌బ్లిక్‌`. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.భగవాన్, జె. పుల్లారావు క‌లిసి నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ర‌మ్య‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు.

Republic trailer review: Sai Dharam Tej fight for justice

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 1న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియోను వ‌దిలారు. ఈ సంద‌ర్భంగా రిప‌బ్లిక్ షూటింగ్ కేవ‌లం 64 రోజుల‌లో పూర్తైంద‌ని మేకింగ్ వీడియోలో స్ప‌ష్టం చేశారు.

Gaana Of Republic: Funny Take On Youth Frustration

ట‌ఫ్ లొకేష‌న్‌లో, వాతావ‌ర‌ణం అనుకూలించని ప్రాంతంలో షూటింగ్ చేసిన‌ట్టు తెలియ‌జేశారు. ఇక తాజాగా విడుద‌ల చేసిన మేకింగ్ వీడియో అదిరిపోయింద‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేసేయండి.

 

Share post:

Latest