రష్మిక అండర్ వేర్ ప్రకటనపై ఫైర్ అవుతున్న నెటిజన్లు?

మందన ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈమె ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ,కన్నడ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. అయితే ఒకవైపు సినిమాల్లో నటిస్తూ మరొకవైపు వివిధ రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తుంది.

తాజాగా రష్మిక మందన పురుషుల అండర్ గార్నమెంట్ బ్రాండ్ మాకో ప్రకటనలో నటించింది. ఇందులో ఆమె విక్కీ కౌశల్ తో కలిసి నటించింది. ఈ ప్రకటనలో రష్మిక విక్కీ కౌశల్ అండర్వేర్ పట్టీని చూస్తూ ఉండటం గమనించవచ్చు. ఈ ప్రకటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ప్రకటన స్టాండర్డ్ తక్కువగా ఉంది సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తుంది అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రష్మిక మీ నుండి ఈ చౌకబారు ప్రకటన ఊహించలేదు అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరొక నెటిజన్ ఇంతకుముందు అర్థం పర్థం లేని లక్స్ కోజీ ప్రకటన ఇప్పుడు మాచో యాడ్ అసలు ఈ అండర్వేర్ డియోడరెంట్ కంపెనీల ప్రచార బృందం ఈ ప్రకటనలతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని కామెంట్ చేశాడు.

సోషల్ మీడియాలో ఎదురవుతున్న ఈ విమర్శలపై ప్రకటనదారులు ఏజెన్సీలు స్పందించడం లేదు. అయితే విక్కీ కౌశల్ తో రష్మిక నటించడం పై అభిమానులు సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా వీరి కలయిక లో సినిమా కూడా రావాలని కోరుకుంటున్నారు.