ఆ స్టార్ హీరోయిన్ బ‌యోపిక్‌లో ర‌ష్మిక‌..ఓపెన్ అయిన ల‌క్కీ బ్యూటీ!

టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

I am a big BTS fan: Rashmika Mandanna | Entertainment News,The Indian  Express

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌ష్మిక వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌, దివంగ‌త న‌టి సౌంద‌ర్య బ‌యోపిక్‌లో న‌టించాల‌నుంది అంటూ త‌మ మ‌న‌సులోని కోరిక‌ను ఓపెన్‌గా చెప్పేసింది. అయితే సౌందర్యనే ఎంచుకోవడానికి కారణం ఏంటో కూడా ర‌ష్మిక తెలిపింది.

Soundarya's relatives fight over her property

ఆమె మాట్లాడుతూ.. `నేను సినిమాల్లోకి రాకముందు మా నాన్న ఒక మాట అనేవారు.. నేను సౌందర్య గారిలా ఉంటానట. తరచుగా నాతో ఆ మాట అనేవారు. ఇక సౌందర్య నటన, సినిమాలు అంటే కూడా నాకు ఇష్టం. అందుకే ఆమె బ‌యెపిక్‌లో న‌టించాల‌నుంది` అంటూ చెప్పుకొచ్చింది. మ‌రి ర‌ష్మిక కొరిక నెర‌వేరుతుందో..లేదో..చూడాలి.

Share post:

Latest