పుష్ప సర్‏ప్రైజ్..షాకింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన‌ ర‌ష్మిక‌..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న‌ తాజా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇర ఈ పాన్ ఇండియా చిత్రం రెండో భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగం క్రిస్మ‌స్ కానుక‌గాను విడుద‌ల కాబోతోంది.

Image

అయితే ర‌ష్మిక ఫ్యాన్స్‌కు పుష్ప మేక‌ర్స్ ఓ అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో ఆమె గ్రామీణ యువతి శ్రీవల్లి పాత్రలో కనిపించనుందనే విషయాన్ని చెబుతూ.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ర‌ష్మిక షాకింగ్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది.

Image

చీర, బొట్టు, గాజులు, పూలు.. దగ్గర పెట్టుకుని ఎక్కడికో హడావిడిగా ముస్తాబవుతున్నట్టు ర‌ష్మిక ఇందులో కనిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈమె ఫ‌స్ట్ లుక్ తెగ ఆక‌ట్టుకుంటూ నెట్టింట వైర‌ల్‌గా మారింది. కాగా, ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీలో బ‌న్నీ పుష్ప‌రాజ్ క‌నిపించ‌బోతున్నాడు. ఆయ‌న్ను ఢీ కొట్ట‌బోయే విల‌న్‌గా మళయాలం నటుడు ఫహద్ ఫాసిల్ న‌టిస్తున్నాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు.