మరో క్రేజీ అప్డేట్ ఇచ్చిన దగ్గుపాటి రానా.. త్వరలోనే?

September 14, 2021 at 5:25 pm

కే సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి భీమ్లా నాయక్ సినిమాలో ప్రధానపాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం కోసం సినిమాకు తెలుగు రీమేక్ ఇది. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ అలాగే సాంగ్ రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాలో నటిస్తున్న రానా కు సంబంధించి ఎటువంటి పోస్టులు కానీ వీడియో కానీ విడుదల చేయకపోవడంతో రానా ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో ఈ చిత్ర బృందం క్లారిటీ ఇస్తూ రానా పాత్రకు సంబంధించిన టీజర్ ను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలు రానా కు సంబంధించి వరుస అప్డేట్ల తో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాలో రానాకు సంబంధించిన ఒక వీడియో సెప్టెంబర్ 17 తర్వాత బయటకు రానుందట. ఆ వీడియో ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచేలా ఉంటుందట. ఆ వీడియో తర్వాత రానా సంబంధించి లుక్, ఫోటోలు, వీడియోలు వరుసగా సందడి చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనితో రానాకు సంబంధించిన అప్డేట్ కోసం రానా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరో క్రేజీ అప్డేట్ ఇచ్చిన దగ్గుపాటి రానా.. త్వరలోనే?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts