టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలాంటి చిరంజీవిని ఎవరూ అంటూ అవమానించే విధంగా మాట్లాడారు ఒక కమెడియన్. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు బాబు మోహన్.
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ గా ఈయన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఈయన చిన్నప్పుడు నాటకాలు కూడా వేసేవారట, అలా నాటకాలు లో మంచి గుర్తింపు తెచ్చుకునే పెళ్లి అయిన తర్వాత కూడా తన భార్యకు తెలియకుండా నాటకాలు వేసే వారట. నాటకాలు వేశారు అని తన భార్యకు తెలిసినప్పుడు ఇద్దరిమధ్య ఇరవై రోజుల పాటు మాటలు కూడా ఉండేవి కాదట. అలా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ హైదరాబాదులోని సారథి స్టూడియో కి వచ్చారట, ఇక్కడ ఒక స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతోందట. అప్పుడు అక్కడికి వెళ్ళిన బాబు మోహన్ షూటింగ్ గ్యాప్ లో పక్కన కూర్చున్న ఒక నటుడు ని పట్టుకొని సినిమాలో హీరో ఎవరు అని అడిగారట. అప్పుడు చిరంజీవి నవ్వి ఆ హీరో ఎవరో కాదు నేనే అని చెప్పాడట. అందుకు బాబు మోహన్ తన తప్పు తెలుసుకుని సారీ సార్ నన్ను క్షమించండి అంటూ వేడుకున్నాడట.