ప్రభాస్‌ను మరోసారి వాడుకుంటున్న డైరెక్టర్?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు గతకొంతకాలంగా చిత్ర యూనిట్ చెబుతూ వస్తోంది. ఇక ఈ సినిమాను పూర్తి వింటేజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో ప్రభాస్ వింటేజ్ లుక్స్‌లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ మూవీని కేజీఎఫ్ చిత్రం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకు సలార్ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను చిత్ర యూనిట్ గతంలోనే ఫిక్స్ చేసింది.

ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో ప్రభాస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ రఫ్ అండ్ మాసీ లుక్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తరువాత బాలీవుడ్‌లో ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్-K అనే సినిమాల్లో నటించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. అయితే సలార్ చిత్రంలో ప్రభాస్ కటౌట్ అండ్ పర్ఫార్మెన్స్ చూసి ఇంప్రెస్ అయ్యాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. దీంతో ప్రభాస్ కోసం మరో పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడట ఈ మాస్ డైరెక్టర్.

అయితే ఈసారి ప్రభాస్ కోసం ఓ మైథలాజికల్ కథను రెడీ చేశాడని, ఇందులో ప్రభాస్ పాత్ర అత్యద్భుతంగా ఉండబోతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్టోరీలైన్‌ను ప్రభాస్‌కు వినిపించాడట ఈ డైరెక్టర్. అయితే ఈ సినిమాపై ప్రభాస్ మాత్రం తన అభిప్రాయాన్ని ఇంకా తెలియజేయలేదట. మరి ప్రశాంత్ నీల్ చెప్పిన కథకు ప్రభాస్ పచ్చ జెండా ఊపుతాడా లేక లైట్ తీసుకుంటాడా అనేది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Share post:

Popular