న‌టుడు కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం..హాస్ప‌ట‌ల్‌లో చేరిక‌..!?

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌భాస్ పెద‌నాన్న‌ కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం తన‌ ఇంటిలో కృష్ణంరాజు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయార‌ట‌. ఈ ప్ర‌మాదంలో కృష్ణంరాజు తుంటికి ఫ్రాక్చర్ అవ్వ‌గా.. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను హైదరాబాద్‌లోని అపోలో హాస్ప‌ట‌ల్‌లో చేర్పించార‌ట‌.

- Advertisement -

Krishnam Raju is in ICU - tollywood

వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం వైద్యులు నేటి ఉద‌యం కృష్ణంరాజు తుంటికి శస్త్రచికిత్స చేశార‌ట‌. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మ‌రోవైపు ఆయన కార్యాలయం నుంచి మరో వాదన వినిపిస్తోంది.

Prabhas will get married this year, says uncle Krishnam Raju | Entertainment News,The Indian Express

కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగానే ఉంద‌ని.. కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసం అపోలోకి వెళ్లార‌ని అంటున్నారు. త్వరలో యూకే వెళ్లాల్సి ఉన్నందున రొటీన్ హెల్త్ చెకప్ చేసుకోవడానికి అపోలోకి వ‌చ్చార‌ని కృష్ణంరాజు కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Share post:

Popular