నా ఫ్రెండ్ బ్లాక్‌బస్టర్ కొట్టాడు..హ్యాపీ అంటున్న‌ ప్ర‌భాస్!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ త‌న ఫ్రెండ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టాడ‌ని తెలిపుతూ ఎంతో ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..గోపీచంద్, తమన్నా జంట‌గా సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `సీటీమార్‌`. క‌బ‌డ్డీ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్ 10న థియేట‌ర్‌లో విడుద‌లైంది.

Gopichand confirms his film with Prabhas? - tollywood

అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ టాక్‌తో భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతూ దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన గోపీచంద్ స్నేహితుడు, మ‌న డార్లింగ్ ప్ర‌భాస్‌.. సోష‌ల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టి సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేశాడు.

Gopichand's Seetimaarr release date is pushed back - English

`నా ఫ్రెండ్ గోపీచంద్ సీటీమార్ మూవీ బ్లాక్‌బస్టర్ కొట్టాడు..హ్యాపీ. కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ సీటీమార్. ఇలాగే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలని కోరుకుంటూ చిత్రబృందానికి అభినందనలు` అని ప్ర‌భాస్ ఇస్టా పోస్ట్‌లో పేర్కొన‌గా.. ప్ర‌స్తుతం ఆయ‌న పోస్ట్ వైర‌ల్‌గా మారింది.

https://www.instagram.com/p/CTtN_9PoZG6/?utm_source=ig_web_copy_link

Share post:

Popular