ఆ హీరోయిన్‌నే కావాలంటున్న ఎన్టీఆర్‌..శివాలెత్తి పోతున్న డైరెక్ట‌ర్‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌లో క‌లిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

NTR30 : Jr. NTR and Koratala Siva officially confirmed next project  together | NewsTrack English 1 NT

ఇక ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ మూవీలో ఆలియా భ‌ట్‌నే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ఎన్టీఆర్ పట్టుపడుతున్నాడట.

Alia Bhatt wants to now work in Hollywood | Filmfare.com

నిజానికి ఈ సినిమాలో మొద‌ట స‌మంత‌ను హీరోయిన్‌గా అనుకున్న‌ప్ప‌టికీ.. ఆ తర్వాత కియారా అద్వానీ పేరును తెర‌పైకి వ‌చ్చింది. కొర‌టాల కూడా కియారానే ఫిక్స్ చేయాల‌ని భావించార‌ట‌. కానీ, ఎన్టీఆర్ కియారా వ‌ద్ద‌ని.. ఆలియానే కావాల‌ని తేల్చి చెప్పేశార‌ట‌. దాంతో కొర‌టాల బాలీవుడ్‌లో బిజీ బిజీగా ఉన్న ఆలియాను ఎలా ఒప్పించాలో తెలియ‌క శివాలెత్తి పోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది.

Share post:

Latest