ఎన్టీఆర్ జోరు..మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్నెల్…?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఆర్ఆర్ఆర్‌ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

Jr NTR fans take over social media trending #KomaramBheemNTR | Telugu Movie  News - Times of India

ఈ మూవీ అయిన వెంట‌నే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న సైతం వ‌చ్చింది. అలాగే ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన డైరెక్ట‌ర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. ఎన్టీఆర్ మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చి మాంచి జోరుగా దూసుకుపోతున్నాడు.

Asuran" director Vetrimaran on a signing spree; lines up projects with  Suriya, Soori and Dhanush in lead roles - The Indian Wire

తమిళ దర్శకుడు వెట్రీమారన్ తో ఓ చిత్రం చేయ‌బోతున్నాడ‌ట‌. వడా చెన్నై, అసురన్ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు వెట్రీమారన్.. ఇటీవ‌ల ఎన్టీఆర్ కు ఓ అదిరిపోయే క‌థ చెప్పార‌ట‌. అది బాగా న‌చ్చ‌డంతో సినిమా చేసేందుకు సిగ్నెల్ ఇచ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సిందే. కాగా, వెట్రీమారన్ ప్ర‌స్తుతం సూర్య‌తో వాడివసల్ మూవీ చేస్తున్నాడు.