బిగ్‌బాస్ 5: కాజ‌ల్ మైండ్‌గేమ్‌..స్క్రీన్ టైమ్ కోస‌మే అలా చేస్తుందా?

సెప్టెంబ‌ర్ 5న అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 రెండు రోజుల‌కే రంజుగా మారింది. హౌస్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్ట‌గా.. ఒక్కొక్కరు ఒక్కో స్ట్రాటజీ ఫాలో అవుతూ స్క్రీన్ టైమ్ కోసం తెగ ఆర‌ట‌ప‌డుతున్నారు. ఈ లిస్ట్‌లో ఆర్జే కాజల్ ముందు వ‌ర‌స‌లో ఉంది.

RJ Kajal: బిగ్‌లో తొలి ఎఫైర్.. కాజల్ ఆ పని మీదే వెళ్లినట్టు ఉందే!! కొత్త యవ్వారం మొదలు - what kind of girl do you like? rj kajal bold question to singer sriram chandra | Samayam Telugu

అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఈమెను ముందే పసిగట్టారు. అయిన‌ప్ప‌టికీ కాజల్ మాత్రం మైండ్‌గేమ్‌తో దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే ఏ విషయాల గురించి మాట్లాడితే కెమెరాల్లో ఫోక్ చేస్తారో సరిగ్గా ఆ విషయం గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. మొదట జబర్దస్త్ ప్రియాంక దగ్గరకు వెళ్లి.. ఆమె ఎమోషనల్ అయ్యేట్టు చేసింది.

Big Boss Updates: Abijeet Fans Troll RJ Kajal on Social Media- Sakshi

ఆ తరువాత హాట్ బ్యూటీ లహరి దగ్గరకు వచ్చి..పెళ్లి గురించి అడిగి ఇంట్లో ఉన్నవాళ్లలో ఎవర్ని చూస్తే ఫీలింగ్స్ వస్తాయని పిచ్చి ప్రశ్నలు వేసింది. ఇక నిన్న‌టి ఎపిసోడ్‌లో సింగ‌ర్ శ్రీరామ్‌ని `నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? సేమ్ నీలాగే ఉండాలా.. ఆపోజిట్ ఉండాలా?` అని ప్ర‌శ్న‌లు వేస్తూ విసిగించింది. ఈ నేప‌థ్యంలోనే కాజ‌ల్ తీరుపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.బిగ్ బాస్ టైటిల్ కోసం హౌస్‌లోకి వెళ్లిందో లేక ఇంట్లో ఉన్న వాళ్లకి పెళ్లి సంబంధాలు సెట్ చేయడం కోసం వెళ్లిందా అంటూ చురుక‌లు అంటిస్తున్నారు.

Share post:

Popular