రిపబ్లిక్ సినిమాకు నాని రివ్యూ.. ఏం అన్నారంటే?

దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం రిపబ్లిక్. ఈ సినిమా అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను జి స్టూడియోస్ సహకారంతో జేబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై జె భగవాన్ ,జె పుల్లా రావ్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది.

రమ్యకృష్ణ, జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాని నాచురల్ స్టార్ నాని చూసి.. పబ్లిక్ సినిమా చూశాను. సాయి ధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరి పై దయ చూపించాడు. అది మీ ప్రార్థనల రూపంలో తిరిగి వచ్చింది. అది మరింత స్ట్రాంగ్ గా రిపబ్లిక్ సినిమా రూపంలో తిరిగి వస్తోంది. దర్శకుడు దేవా కట్టా ఈ సినిమాతో తిరిగి ఇంతకుమునుపు ఫామ్ లోకి వచ్చాడు. ఈ రిపబ్లిక్ సినిమా టీం కు అభినందనలు అయినా ట్వీట్ చేశారు. ఇకపోతే ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest