రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రానికి హీరో నాని సపోర్ట్.. ఏం చేశారంటే

September 30, 2021 at 5:30 pm

క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు , తమిళ స్టార్ శింబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా మానాడు. ఈ సినిమా వీ హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత సురేష్ 125 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాను హిందీ, తమిళం,తెలుగు, కన్నడ, మలయాళం ఇలా అయిదు భాషల్లో కూడా నిర్మిస్తున్నారు. ఇందులో తమిళ స్టైలిష్ స్టార్ శింబు కి జోడి గా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తోంది. అంతే కాకుండా ఇందులో దర్శకులు భారతీరాజా, ఎస్.జె.సూర్య, ఎస్ ఏ చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

సర్వ కర్త యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ మొదటి సింగిల్ మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను నేచురల్ స్టార్ నాని అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా విడుదల చేయనున్నారు. అలాగే తమిళ ట్రైలర్ ఏ ఆర్ మురుగదాస్, మలయాళంలో నివిన్ పాలి, కన్నడ లో రక్షిత్ శెట్టి విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు ఎడిటింగ్ ప్రవీణ్ కె.ఎల్ నిర్వహిస్తున్నారు.

రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌ చిత్రానికి హీరో నాని సపోర్ట్.. ఏం చేశారంటే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts