ద‌స‌రాకు ట్రిపుల్ ట్రీట్ ఇవ్వ‌బోతున్న బాల‌య్య‌..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే!

ఈ ఏడాది ద‌స‌రాకు నంద‌మూరి బాల‌కృష్ణ త‌న అభిమానుల‌కు ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ట్రీట్స్ ఇవ్వ‌బోతున్నార‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..బాల‌య్య ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను ద‌స‌రాకు విడుద‌ల‌ని ప్లాన్ చేస్తున్నారు.

Boyapati talks about Akhanda release date - tollywood

త్వ‌ర‌లోనే దీనిపై అధికార‌క ప్ర‌క‌ట‌న కూడా రానుంది. అలాగే అఖండ త‌ర్వాత గోపీచంద్ మలినేనితో బాల‌య్య ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నిర్మితం కానున్న ఈ చిత్రం నుంచి ద‌స‌రాకు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

Balayya-Gopichand Malineni Film From Oct 1st -

ఇక మ‌రోవైపు బాల‌య్య స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయ‌నున్నాడు. అయితే ద‌స‌రాకు ఈ సినిమా నుంచి కూడా ఓ అదిరిపోయే అప్డేట్ రాబోతోంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా దసరాకు ఒకేసారి మూడు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వ‌స్తే.. నంద‌మూరి అభిమానుల‌కు ఈ పండ‌గ మ‌రింత అద్భుతంగా మారుతంది.

NBK-Anil Ravipudi movie is likely to be imparted on..! - English

Share post:

Latest