మా ప్ర‌యాణం ఆగిపోతోంది..చాలా బాధగా ఉందంటున్న నాగ‌చైత‌న్య‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. భారీ అంచ‌నాల న‌డుము సెప్టెంబ‌ర్ 24న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సంద‌ర్భంగా నిన్న హైద‌రాబాద్‌లో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని మేక‌ర్స్ నిర్వ‌హించారు.

 అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదిన ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది లవ్ స్టోరి చిత్రబృందం. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు గెస్ట్స్‌గా అక్కినేని నాగార్జున, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు కేఎస్ రామారావు, డి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. Photo : Twitter

ఈ కార్య‌క్ర‌మానికి నాగార్జున్‌, డైరెక్ట‌ర్ సుకుమార్ స్పెష‌ల్ గెస్ట్‌లుగా విచ్చేశారు. అయితే ఈ కార్య‌క్ర‌మంలో నాగ చైత‌న్య ఆస‌క్తిక వ్యాఖ్య‌లు చేశాడు. చైతు మాట్లాడుతూ `ఈ నెల 24న లవ్ స్టోరీ విడుదల కావడం, సూప‌ర్ హిట్‌గా నిలవ‌డంతో ఎంతో ఆనందించాను. థియటర్లకు వచ్చిన తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా థ్యాంక్స్.

 హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ మా సక్సెస్ మీట్‌కు వచ్చిన పెద్ద వాళ్లందరికీ థాంక్స్ చెప్పారు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి అంశంలో లవ్ స్టోరి మ్యాజిక్ చేసిందని తెలిపారు. ప్రేక్షకులందరికీ  థ్యాంక్స్. ఈ సినిమాలో జరిగినట్లు నాకు అయింది అని చెప్పేందుకు అమ్మాయిలకి ఒక ధైర్యాన్ని లవ్ స్టోరి ఇచ్చిందని సాయి పల్లవి తెలిపారు. Photo : Twitter

అలాగే డైరెక్టర్ శేఖర్ కమ్ముల నుంచి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకున్నాను.. మా ప్రయాణం ఈ సినిమా విడుదలతో ఆగిపోతోందంటే చాలా బాధ‌ను క‌లిగిస్తోంది. అందుకే ఈ జర్నీని ఆపొద్దు సర్..` అంటూ శేఖర్ కమ్ములను కోరారు. దాంతో ఇప్పుడు చైతు కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Share post:

Latest