ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు అంటోన్న చైతూ!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాలని చైతూ చూస్తున్నాడు. ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంత ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే చైతూ తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే ప్రారంభించాడు.

దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్ యు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో చైతూ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చైతూ ఏకంగా మూడు విభిన్న గెటప్స్‌లో ప్రేక్షకులను మెప్పించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రేమమ్ చిత్రంలో కూడా చైతూ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

ఇప్పుడు ‘థ్యాంక్ యూ’ చిత్రంలో కూడా ఇలాంటి సీన్ రిపీట్ కానుండటంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని చైతూ అభిమానులు ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమాను విక్రమ్ కుమార్ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి చైతూ ఈ సినిమాలో ఎలాంటి గెటప్స్‌లో కనిపిస్తాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Share post:

Latest